You are currently viewing Andhra Pradesh: Wild card entries for 4th Khelo India Games U18

Andhra Pradesh: Wild card entries for 4th Khelo India Games U18

  • Post author:
  • Post category:Trials
Andhra Pradesh: Wild card entries for 4th Khelo India Games U18

4వ ఖెలో ఇండియా గేమ్స్ కు వైల్డ్ కార్డు ఎంట్రీలు

4వ ఖెలో ఇండియా క్రీడలు అండర్-18 (బాలురు & బాలికలు) విభాగంలో ఫిబ్రవరి 5 నుండి 14వ తేది 2022 వరకు హర్యానాలో జరగబడును. ఈ సంవత్సరము వైల్డ్ కార్డు ఎంట్రీ (wild card entry) ద్వారా 15 వ్యక్తిగత క్రీడల యందు ప్రవేశమునకు అర్హత కలిగిన వారిని ఎంపిక చేసి పంపు సదుపాయమును ఖెలో ఇండియా వారు ఆంధ్రప్రదేశ్ కి కూడా అవకాశం కల్పించడం జరిగినది. కావున రాష్ట్రములో ఉన్నటువంటి అర్హత కలిగిన క్రీడాకారులందరూ వారికి సంబంధించిన అసోసియేషన్ వారిని సంప్రదించి మీ యొక్క వివరములు నమోదు చేసుకోగలరు.

15 క్రీడా అంశములు:

ఆర్చరీ, సైక్లింగ్, వెయిట్లిఫ్టింగ్, జిమ్నాస్టిక్, అథ్లెటిక్స్, జూడో, రెస్లింగ్, యోగాసన, బ్యాడ్మింటన్, తాంగ్-ట, షూటింగ్, టేబుల్ టెన్నిస్, బాక్సింగ్, స్విమ్మింగ్, మరియు టెన్నిస్.

అర్హతలు:

1. క్రీడాకారులు జూనియర్ మరియు సీనియర్ నేషనల్స్ యందు ఖచ్చితముగా పాల్గొని ఉండాలి.

2. క్రీడాకారులు 1-1-2003 తరువాత జన్మించిన వారై ఉండాలి.

ఈ క్రీడా ఎంపికలు గవర్నమెంట్ అఫ్ ఇండియా యందు గల వైల్డ్ కార్డు ఎవల్యూషన్ కమిటీ వారి ఆధ్వర్యములో జరుగును. ఎంపిక కాబడిన క్రీడాకారుల యొక్క పేర్లను ఆయా రాష్ట్రములకు తెలియజేస్తారు. ఎంపికైన క్రీడాకారులు మాత్రమే 4వ ఖెలో ఇండియా క్రీడలలో పాల్గొంటారు.

విద్యార్ధులు పాల్గొనేందుకు సమర్పించవలసిన ధ్రువపత్రాలు :

ఆధార్ కార్డు లేదా పాస్-పోర్ట్, మెట్రిక్యులేట్ సర్టిఫికేట్, పాఠశాల బోనాఫైడ్ సర్టిఫికేట్ మరియు జనన ధృవీకరణ పత్రం (మునిసిపల్ కార్పొరేషన్ లేదా గ్రామ పంచాయతి ద్వారా 5 సంవత్సరాల క్రితం లేదా నవంబర్ 21, 2016 లోపు జారీ చేయబడి ఉండాలి).

విద్యార్ధులు కాని వారు పాల్గొనేందుకు సమర్పించవలసిన ధ్రువపత్రాలు :

ఆధార్ కార్డు లేదా పాస్-పోర్ట్, మెట్రిక్యులేట్ సర్టిఫికేట్ మరియు జనన ధృవీకరణ పత్రం (మునిసిపల్ కార్పొరేషన్ లేదా గ్రామ పంచాయతి ద్వారా 5 సంవత్సరాల క్రితం లేదా నవంబర్ 21, 2016 లోపు జారీ చేయబడి ఉండాలి) మరియు ఓటు గుర్తింపు కార్డ్.

అర్హత కలిగిన క్రీడాకారులు వారికి సంబంధించిన అసోసియేషన్ వారిని సంప్రదించి ధ్రువపత్రాలు సమర్పించవలెను.

తదుపరి అసోసియేషన్ వారు నవంబర్ 17, 2021 లోపు క్రీడాకారుల యొక్క సమాచారమును శాప్ వారికి సమర్పించెదరు.

Wild card entries for 4th Khelo India Games
4th Khelo India Sports Under-18 (Boys & Girls) section will be held in Haryana from February 5 to 14th 2022 Khelo India has also given Andhra Pradesh an opportunity to select the eligible people to enter 15 individual sports through wild card entry this year. So all eligible athletes in the state can contact their association to register your details.

15 sports elements: Archery, cycling, weightlifting, gymnastics, athletics, judo, wrestling, yoga, badminton, thang-ta, shooting, table tennis, boxing, swimming, and tennis.

Qualifications:
1. athletes must have participated in the junior and senior nationals.
2. athletes should be born after 1-1-2003

This sporting selection will be held under the supervision of the Wild Card Evolution Committee of Government of India. The names of the selected players will be informed to the respective states. Only selected players will participate in 4th Khelo India sports.

The pole papers that students should submit for participation: Aadhaar Card or Passport, Matriculate Certificate, School Bonafide Certificate and Birth Certificate (must be issued by Municipal Corporation or Gram Panchayat 5 years ago or before November 21, 2016).

Pole papers to be submitted by non-students to participate: Aadhaar card or passport, matriculate certificate and birth certificate (should be issued by municipal corporation or village panchayat 5 years ago or before November 21, 2016) and vote identity card.

Eligible athletes should contact their association and submit their poles.

The next association will submit information of athletes to SAP before November 17, 2021